గాంధీని కాకుండా జిన్నాను హత్య చేసి ఉంటే దేశ విభజన జరిగేది కాదు: శివసేన
- జిన్నాను హత్య చేసి ఉంటే విభజన ఘోరాలు గుర్తుకొచ్చే రోజు అవసరం ఉండేది కాదు
- మన దేశ విభజన గాయం ఎలా మానుతుంది?
- అఖండ హిందుస్థాన్ సాధ్యమయ్యేలా లేదు
ఒక దేశ సార్వభౌమాధికారం, అస్తిత్వం విధ్వంసాల తాలూకు బాధ ఎలా ఉంటుందో ప్రస్తుత ఆప్ఘనిస్థాన్ పరిస్థితులు గుర్తు చేస్తున్నాయిని సంజయ్ రౌత్ తన ఎడిటోరియల్ లో పేర్కొన్నారు. మన దేశం విషయానికి వస్తే... విభజన గాయం ఎలా మానుతుందని ప్రశ్నించారు. విడిపోయిన ముక్కను కలుపుకోకపోతే విభజన గాయం నుంచి ఉపశమనం లభించదని అన్నారు. అఖండ హిందుస్థాన్ ఏర్పడాలని మనం కోరుకుంటున్నప్పటికీ... అది సాధ్యమయ్యేలా లేదని చెప్పారు. ప్రధాని మోదీ అఖండ హిందుస్థాన్ ను కోరుకుంటే శివసేన స్వాగతిస్తుందని తెలిపారు.