తెలంగాణలో మరో 364 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 75,289 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 76 కేసులు
- పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 6,608 మందికి చికిత్స
అదే సమయంలో 482 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,54,758 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,44,294 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,608 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,856కి పెరిగింది.
