పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుడి అరెస్ట్
- విజయనగరం జిల్లా చౌడువాడలో ఘటన
- అర్ధరాత్రి యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు
- దిశ యాప్ కాల్ ద్వారా సమాచారం వచ్చిందన్న ఎస్పీ
- 7 రోజుల్లో చార్జిషీటు వేస్తామని వెల్లడి
రాంబాబు 8 నెలల కిందట రాములమ్మను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, అయితే ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని కక్ష పెంచుకున్నాడని వివరించారు. రాములమ్మపై అర్ధరాత్రి వేళ పెట్రోల్ పోసి హత్యాయత్నం చేశాడని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై 7 రోజుల్లో చార్జిషీటు వేస్తున్నామని వెల్లడించారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు ముమ్మరం చేశామని వివరించారు.