రాజకీయాల్లో మహిళలకు అవకాశంపై రిపోర్టర్ ప్రశ్నిస్తే పగలబడి నవ్విన తాలిబన్లు!

Talibans laughed at woman reporter after she questioned them on women in politics
  • ఆఫ్ఘన్ లో తాలిబన్ పాలన
  • తాలిబన్ నేతలను ఇంటర్వ్యూ చేసిన మహిళా రిపోర్టర్
  • మహిళల రాజకీయ ప్రవేశంపై ప్రశ్న
  • నవ్వొస్తోందంటూ కెమెరా నిలిపివేయించిన తాలిబన్లు
మూర్ఖత్వానికి ప్రతీకలుగా తాలిబన్ల గురించి చెప్పుకుంటారు. అలాంటి వారి దృష్టిలో మహిళల స్థానం ఏంటో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. తాజాగా ఓ మహిళా రిపోర్టర్ కొందరు తాలిబన్ నేతలను ఇంటర్వ్యూ చేసింది. ఆఫ్ఘన్ ప్రస్తుత పరిస్థితులపై వారిని ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలన్నింటికి వారు సజావుగానే సమాధానం చెప్పారు. మహిళల హక్కుల గురించి ప్రశ్నిస్తే షరియా చట్టం ప్రకారం వర్తింపజేస్తామని అన్నారు.

ఈ క్రమంలో, మహిళా రాజకీయనేతలు ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్య పదవులు చేపట్టడం మీకు సమ్మతమేనా? అని ఆ రిపోర్టర్ ప్రశ్నించడంతో, ఆ తాలిబన్ నేతలు పగలబడి నవ్వారు. అంతేకాదు, "మాకు నవ్వొస్తోంది" అంటూ మీడియా కెమెరాను కూడా నిలిపివేయించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Go Back to Shorts
Taliban
Women Reporter
Politics
Women

More Telugu News