ట్విట్టర్‌లో మీ అందరి ముందుకి మళ్లీ వస్తున్నాను: బండ్ల గణేశ్
- ట్విట్టర్ నుంచి వైదొలగుతున్నట్టు ఇటీవల ప్రకటన
- నిర్ణయాన్ని మార్చుకున్న బండ్ల గణేశ్
- 'జర్నలిస్ట్ డైరీ' సతీశ్ బాబు సలహాతో ట్విట్టర్‌లో కొనసాగింపు
'పెద్దలు జర్నలిస్ట్ డైరీ సతీశ్ బాబు గారు ఈ రోజు ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండమని నాకు సలహా ఇవ్వటం, వారు ఇచ్చిన సలహాను గౌరవంగా భావించి మీ అందరి ముందుకి మళ్లీ వస్తున్నాను' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. కాగా, నటుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేశ్ ప్రస్తుతం నిర్మాతగానూ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు.