అభివృద్ధిలో దూసుకెళుతున్న జగన్ ప్రభుత్వాన్ని అప్రదిష్ఠపాల్జేయడమే ఆ విపక్ష, స్వపక్ష ఎంపీ లక్ష్యం: విజయసాయిరెడ్డి

  • ట్విట్టర్ లో విజయసాయి పరోక్ష వ్యాఖ్యలు
  • కేంద్రానికి లేఖలు రాస్తున్నారని ఆరోపణ
  • ఉపాధి హామీ నిధులు ఆపేయాలంటున్నారని ఆగ్రహం
  • ఎంత నీచుడో అంటూ ట్వీట్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళుతున్న జగన్ ప్రభుత్వాన్ని అప్రదిష్ఠపాల్జేయడమే ఒక విపక్ష, స్వపక్ష ఎంపీ లక్ష్యం అని విమర్శించారు. రాష్ట్రానికి ఉపాధి హామీ నిధులు ఆపేయాలంటూ కేంద్రానికి లేఖలు రాస్తున్నారంటే ఎంత నీచుడో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. పేదవాడి నోటి వద్ద నుంచి ముద్దను కూడా లాగేసే దుర్మార్గానికి వెనుకాడడంలేదని పేర్కొన్నారు. విజయసాయి ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు! 

Vijay Sai Reddy
CM Jagan
AP Govt
Rebel MP
YSRCP

More Telugu News