కాబూల్ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రధాన సవాలుగా మారాయి: కేంద్రమంత్రి జై శంకర్
- ఆఫ్ఘన్ లో తాలిబన్ పాలన
- స్వదేశానికి భారత పౌరులు
- ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్న జై శంకర్
- ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడీ వివరాల వెల్లడి
కాబూల్ లో పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని వివరించారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఓ ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాబూల్ లో ఉన్న సిక్కులు, హిందూ సంఘాల నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, భారత పౌరుల సంక్షేమమే తమకు ప్రథమ ప్రాధాన్యత అని జై శంకర్ ఉద్ఘాటించారు.
కాబూల్ లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారతీయుల గురించి కచ్చితమైన సమాచారం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎవరివద్ద అయినా కీలక సమాచారం ఉంటే 919717785379 ఫోన్ నెంబరుకు గానీ, [email protected] ఈమెయిల్ ఐడీకి గానీ అందించాలని సూచించారు.