రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ చెన్నై బెంచ్ లో విచారణ
- జలవివాదాలపై ఎన్జీటీ విచారణ
- తెలంగాణ సమర్పించిన ఫొటోల పరిశీలన
- ఏపీ పనులు కొనసాగించినట్టుందని వ్యాఖ్యలు
- తాము పనులు నిలిపివేశామన్న ఏపీ
దీనిపై ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ, ఆగస్టు 7వ తేదీ నాటికే పనులను నిలిపివేసినట్టు స్పష్టం చేసింది. ఈ నెల 7 తర్వాత ఎలాంటి పనులు చేపట్టలేదని వివరణ ఇచ్చింది. ఈ క్రమంలో, పర్యావరణ శాఖతో ఏపీ కుమ్మక్కైనట్టు అనిపిస్తోందని ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంతవరకు పర్యావరణ శాఖ నివేదిక ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. అనంతరం, ఈ నెల 27న తదుపరి చర్యలపై తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. విచారణను అప్పటివరకు వాయిదా వేసింది.