కృష్ణానదిలో మళ్లీ ప్రారంభం కానున్న జలవిహారం.. విహారయాత్రలకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా
- మళ్లీ కళ సంతరించుకోనున్న కృష్ణానది
- రూ. 3, 999తో రెండు ప్యాకేజీలు
- ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ట్రిప్పుల పెంపు
కృష్ణా నదిలో విహారయాత్రలకు సంబంధించి పలు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్-శ్రీశైలం-సోమశిల యాత్రకు ఒక్కొక్కరికి రూ.3,999 చొప్పున వసూలు చేస్తారు. ఇది రెండు రోజుల ప్యాకేజీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు కూడా ఉన్నాయి. రెండో ప్యాకేజీలో హైదరాబాద్-శ్రీశైలం-నాగార్జునసాగర్ యాత్ర. గతంలో ఈ యాత్ర శ్రీశైలం నుంచి సాగర్ వరకు ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ రెండు యాత్రలు ఉదయం ఏడు గంటల సమయంలోనే ప్రారంభం అవుతాయి. ఈ ప్యాకేజీ ధర కూడా రూ. 3,999 మాత్రమే. ప్రతి శనివారం యాత్రలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి వారంలో మూడు ట్రిప్పులు వేస్తారు.