Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

three fishermen went missing while going to sea
షార్ట్స్‌లో చూడండి
శ్రీకాకుళం జిల్లా గార మండలంలో చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ తెల్లవారుజామున గారకు చెందిన పలువురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. అనంతరం వారిలో ముగ్గురు గల్లంతయ్యారు. గమనించిన తోటి మత్స్యకారులు వెంటనే వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గణేశ్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. గల్లంతైన మిగతా ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. విషయం తెలిసిన బాధిత కుటుంబాలు సముద్రం ఒడ్డుకు చేరుకున్నాయి. వారి రోదనలతో ఆ ప్రాంతం విషాదంగా మారింది.

Go Back to Shorts
Srikakulam District
Gara Village
Fishermen

More Telugu News