ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలు వేసుకుంటే చింపాంజీలుగా మారతారంటూ ప్రచారం.. 300 ఖాతాలపై ఫేస్బుక్ వేటు
- ఇండియా, లాటిన్ అమెరికా ఖాతాదారులే లక్ష్యంగా ప్రచారం
- 65 ఫేస్బుక్, 243 ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై వేటు
- నిబంధనలు ఉల్లంఘిస్తే సహించబోమన్న ఫేస్బుక్
ఈ దుష్ప్రచారంపై స్పందించిన ఫేస్బుక్ 300 ఖాతాలపై వేటేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారంతా రష్యన్లేనని.. ఇండియా, లాటిన్ అమెరికా ఖాతాదారులే లక్ష్యంగా వారు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నట్టు గుర్తించింది. నిబంధనలను ఉల్లంఘించిన 65 ఫేస్బుక్ ఖాతాలు, 243 ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించినట్టు ఫేస్బుక్ తెలిపింది.