జియోకు డీల్ ఇచ్చేసిన ఎయిర్ టెల్.. ఏపీ సహా మూడు సర్కిళ్లలో ఇక జియో స్పెక్ట్రమ్
- రూ.1004.8 కోట్లతో ఒప్పందం
- జియోకు ‘వినియోగ హక్కుల’ బదిలీ
- మరో రూ.469.3 కోట్లు వస్తాయన్న ఎయిర్ టెల్
ఆ డీల్ కు సంబంధించి ఇవాళ రెగ్యులేటరీ ఫైలింగ్ ను ఎయిర్ టెల్ సమర్పించింది. ఆ మూడు సర్కిళ్లలో ఎయిర్ టెల్ స్పెక్ట్రమ్ ను జియో చేతికిచ్చేలా ‘వినియోగ హక్కులను’ బదిలీ చేసినట్టు వివరించింది. ఇప్పటికే జియోతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ మొత్తం తమకు బదిలీ అయిందని చెప్పింది. భవిష్యత్ లో మరో రూ.469.3 కోట్లను జియో చెల్లిస్తుందని వివరించింది.