హైకోర్టును కర్నూలుకు తరలించాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రికి వైసీపీ ఎంపీల వినతి
- న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజుని కలిసిన వైసీపీ ఎంపీలు
- అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని వినతి
- జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని విన్నపం
ఫిరాయింపులకు పాల్పడే వారిపై గడువులోగా చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరించాలని, ఎస్సీ కమిషన్ తరహాలో జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. కిరణ్ రిజుజును కలిసిన వారిలో విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.