Telangana: తీన్మార్​ మల్లన్న పిటిషన్​ పై సర్కార్​ కు హైకోర్టు ఆదేశాలు

High Court Asks State Government To File Counter On Mallanna Petition

  • కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
  • విచారణ రెండు వారాలకు వాయిదా
  • పోలీసులు వేధిస్తున్నారంటూ మల్లన్న పిటిషన్

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ వేసిన పిటిషన్ పై వెంటనే కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇవాళ మల్లన్న వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇటీవల తీన్మార్ మల్లన్న ఆఫీసులపై పోలీసులు దాడులు చేసి, పలు హార్డ్ డిస్క్ లను పట్టుకెళ్లారు. మర్నాడు సికింద్రాబాద్ లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఈ నేపథ్యంలోనే తనను పోలీసులు వేధిస్తున్నారని, కారణాల్లేకుండా పోలీస్ స్టేషన్ కు పిలుస్తున్నారని పేర్కొంటూ హైకోర్టులో మల్లన్న పిటిషన్ వేశారు.

సీసీఎస్, చిలకలగూడ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారని అందులో పేర్కొన్నారు. పదే పదే తనను స్టేషన్ కు పిలవకుండా ఆన్ లైన్ లోనే దర్యాప్తు చేసేలా ఆదేశాలివ్వాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News