Telangana: కారు దహనం.. డిక్కీలో శవం.. మూడు పోలీస్​ స్టేషన్ల సిబ్బంది దర్యాప్తు

Dead Body Found In Completely Charred Car Boot
  • మెదక్ జిల్లా మంగళపర్తిలో దారుణం
  • కారు ఓ థియేటర్ యజమానిదిగా గుర్తింపు
  • చాసిస్ నంబర్ ఆధారంగా గుర్తించిన పోలీసులు
కొందరు దుండగులు కారును దహనం చేశారు. అయితే, ఆ కారు డిక్కీలో పూర్తిగా కాలిపోయిన వ్యక్తి మృతదేహం ఉండడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివార్లలో చోటు చేసుకుంది. కాలిపోయిన కారును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో మూడు పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.

తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, తూప్రాన్ సీఐ స్వామిగౌడ్, నర్సాపూర్ సీఐ లింగేశ్వర్ రావు, నారాయణపేట సీఐ నాగార్జునగౌడ్, పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి వచ్చారు. హత్యకోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. కారు ఇంజన్, చాసిస్ నంబర్ ఆధారంగా ఆ కారు మెదక్ లోని ఓ థియేటర్ యజమానిదిగా గుర్తించారు.
Telangana
Crime News
Medak District

More Telugu News