Andhra Pradesh: అత్యుత్సాహం చూపిస్తే శిక్ష తప్పదు: రఘురామకృష్ణరాజు

RaghuRamakrishna Raju Warns Officials
  • అధికారుల తీరుపై విమర్శలు
  • తప్పును తప్పుగానే చెప్పాలని హితవు
  • నాయకుల మెప్పు కోసం ప్రయత్నిస్తే శిక్ష తప్పదని హెచ్చరిక
అత్యుత్సాహం ప్రదర్శిస్తే శిక్ష తప్పదని అధికారులనుద్దేశించి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మించిన విషయంలో ఉన్నతాధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఆ విషయాన్ని ప్రస్తావించిన రఘురామకృష్ణరాజు.. అధికారుల తీరును తప్పుబట్టారు. నాయకుల మెప్పు కోసం ప్రయత్నించి అధికారులు ఇలాంటి తప్పు చేస్తే శిక్షలు తప్పవని చురకలంటించారు. అధికారులు ఎప్పుడైనా తప్పును తప్పుగానే చెప్పాలని ఆయన హితవు పలికారు. అనవసరంగా అత్యుత్సాహం చూపించొద్దన్నారు.
Andhra Pradesh
Raghu Rama Krishna Raju
AP High Court
High Court

More Telugu News