నల్సా యాప్ ను ప్రారంభించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- యాప్ రూపొందించిన జాతీయ న్యాయసేవల అథారిటీ
- ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్వీ రమణ
- ఉచిత న్యాయసేవలు అందించాలని పిలుపు
- న్యాయవాదులకు, మీడియాకు దిశానిర్దేశం
పేదలకు న్యాయం దూరం కారాదని జాతిపిత మహాత్మాగాంధీ అభిలషించేవారని ఎన్వీ రమణ గుర్తు చేసుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమకాలంలోనే ఉచిత న్యాయ సేవలకు నాంది పలికారని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. నాడు స్వాతంత్ర్య సమరయోధులే రాజ్యాంగ రచనలో పాల్గొన్నారని వివరించారు. అందువల్లే ఉచితన్యాయం అనేది ప్రజలకు హక్కుగా వచ్చిందని స్పష్టం చేశారు.