Suryapet District: ప్రేమించిన అమ్మాయి లేని జీవితం త‌న‌కు వ‌ద్దంటూ.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువ‌కుడి ఆత్మ‌హ‌త్య

lovers commit suicide
  • సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డలో ఘ‌ట‌న
  • రెండు రోజుల క్రితం మౌనిక అనే అమ్మాయి ఆత్మ‌హ‌త్య‌
  • మ‌న‌స్తాపం చెందిన ప‌వ‌న్
తాను ప్రేమించిన అమ్మాయి లేని జీవితం త‌న‌కు వ‌ద్దంటూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు ఓ యువ‌కుడు. సూర్యాపేట జిల్లా, హుజూర్‌ నగర్‌ మండలం బూరుగడ్డలో ఈ విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం మౌనిక అనే అమ్మాయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

ఈ విష‌యం తెలుసుకున్న ప్రియుడు ప‌వ‌న్ మ‌న‌స్తాపానికి గురై సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి మృతి చెందాడు. పవన్ తీసుకున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. మౌనిక‌, ప‌వ‌న్  పెళ్లికి మొద‌ట వారి త‌ల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అయితే, ఇటీవ‌ల మ‌ళ్లీ గొడ‌వ‌లు రావ‌డంతో మౌనిక ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.
Suryapet District
Crime News

More Telugu News