మసాజ్ పేరుతో వ్యభిచారం.. బంజారాహిల్స్‌లో మసాజ్‌ సెంటర్‌పై పోలీసుల దాడి

Police attack on banjara hills massage center
  • బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లో మసాజ్ సెంటర్
  • వీఐపీలను తీసుకొచ్చి అసాంఘిక కార్యకలాపాలు
  • ఆరుగురు మహిళలు, ఇద్దరు విటుల అరెస్ట్
మసాజ్ పేరుతో యథేచ్ఛగా వ్యభిచారం సాగిస్తున్న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మసాజ్ సెంటర్‌పై పోలీసులు దాడి చేశారు. రోడ్‌ నంబరు 12లో ఉన్న మసాజ్‌ సెంటర్‌లో కొందరు వీఐపీలను తీసుకొచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు నిఘా విభాగం అధికారులకు సమాచారం అందింది. వారు వెస్ట్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులకు సమాచారం అందించారు.

నిఘా పెట్టిన పోలీసులు నిన్న ఆ మసాజ్ సెంటర్‌పై దాడి చేసి ఆరుగురు మహిళలు, ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు.
Go Back to Shorts
Massage Centre
Hyderabad
Banjara Hills

More Telugu News