ఇంగ్లండ్ తో తొలి టెస్టు: లంచ్ సమయానికి భారత్ స్కోరు 97/1

  • ట్రెంట్ బ్రిడ్జ్ లో భారత్, ఇంగ్లండ్ తొలిటెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేసిన ఇంగ్లండ్
  • భారత్ కు శుభారంభం ఇచ్చిన ఓపెనర్లు
  • అర్ధసెంచరీ చేరువలో కేఎల్ రాహుల్
ఇంగ్లండ్ తో తొలి టెస్టులో భారత్ కు మొదటి ఇన్నింగ్స్ లో శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తొలి వికెట్ కు 97 పరుగులతో పటిష్ఠ పునాది వేశారు. రోహిత్ శర్మ 36 పరుగులు చేసి రాబిన్సన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. కేఎల్ రాహుల్ 48 పరుగులతో ఆడుతున్నాడు. రాహుల్ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లున్నాయి. అటు రోహిత్ శర్మ 6 ఫోర్లు నమోదు చేశాడు. ఇంగ్లండ్ బౌలింగ్ ను ఈ జోడీ సమర్థంగా ఎదుర్కొంది. రోహిత్ శర్మ వికెట్ అనంతరం అంపైర్లు లంచ్ ప్రకటించారు.

Team India
England
First Test
Nottingham

More Telugu News