Prabhudeva: ఆసక్తిని రేపుతున్న ప్రభుదేవా ఫస్టు లుక్!

Prabhudeva first look from Poikkal Kuthirai
షార్ట్స్‌లో చూడండి
ప్రభుదేవా డాన్స్ మాస్టర్ గా .. నటుడిగా .. దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన ఒక వైపున దర్శకుడిగా తన సినిమాలు చేసుకుంటూనే, ఇతర సినిమాల్లోను నటిస్తున్నాడు. అలాంటి ప్రభుదేవా తమిళంలో ఒక విభిన్నమైన సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరే .. 'పోయిక్కల్ కుతిరాయ్'. సంతోష్ జయకుమార్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చెన్నైలో జరుగుతోంది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణను పూర్తిచేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభుదేవా కృత్రిమ కాలుతో కనిపిస్తున్నాడు. ఒక చేత్తో ఒక పాపను ఎత్తుకుని ఉన్న ఆయన, మరో చేత్తో ఒక ఇనుప ఆయుధాన్ని పట్టుకుని ఉన్నాడు. శత్రువుల బారి నుంచి ఆ పాపను కాపాడే ప్రయత్నంలో ఆయన ఉన్నాడనే విషయం అర్థమవుతోంది.

కెరియర్ పరంగా ప్రభుదేవాకి  ఇది 54వ సినిమా. రైజా విల్సన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ముఖ్యమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ - సముద్రఖని కనిపించనున్నారు. ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను, తమిళంతో పాటు తెలుగులోను డిసెంబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
Go Back to Shorts
Prabhudeva
Varalakshmi Sharath Kumar
Raiza Wilson

More Telugu News