'దేశం గర్విస్తోంది'.. చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టుకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
- హాకీ జట్టు సాధించిన విజయం యువతకు ఆదర్శం
- అసాధారణ ప్రతిభ కనబరిచింది: కోవింద్
- ఈ విజయం భారతీయులకు మరపురాని రోజు
- యువతకు స్ఫూర్తి కలిగించే విజయాన్ని అందించారు: మోదీ
భారత హాకీ జట్టును చూసి దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశానికి కాంస్యం అందించిన హాకీ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. ఈ విజయం భారతీయులకు మరపురాని రోజని చెప్పారు. యువతకు స్ఫూర్తి కలిగించే విజయాన్ని అందించారని పేర్కొన్నారు.
41 ఏళ్ల తర్వాత భారత్ హాకీ జట్టుకు విశ్వక్రీడల్లో మన్‌ప్రీత్ సింగ్ సేన పతకం అందించడంతో అమృత్సర్ లోని ఆయన నివాసం వద్ద కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. నృత్యం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.