సతీసమేతంగా రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం జగన్

CM Jagan met governor at Rajbhavan
  • గవర్నర్ తో సీఎం జగన్ భేటీ
  • జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైనం
  • ఇరువురి మధ్య కొద్దిసేపు చర్చ
  • నిన్న గవర్నర్ పుట్టినరోజు
  • వేడుకలకు దూరంగా ఉన్న గవర్నర్
ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా రాజ్ భవన్ కు వెళ్లారు. సీఎం జగన్, ఆయన భార్య వైఎస్ భారతి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా, గవర్నర్ తో సీఎం జగన్ కొద్దిసేపు భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పుట్టినరోజు నిన్న కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆయన ఎలాంటి వేడుకలు జరుపుకోలేదు. సీఎం జగన్ నిన్ననే ట్విట్టర్ వేదికగా గవర్నర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
Go Back to Shorts
YS Jagan
Governor
Biswabhusan Harichandan
Birthday

More Telugu News