హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
- ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
- మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించిన రాహుల్
- ఈరోజు పరామర్శించనున్న కేజ్రీవాల్
ఘటన వివరాల్లోకి వెళ్తే, నాంగల్ శ్మశానవాటిక నుంచి నీటిని తెచ్చేందుకు వెళ్లిన తొమ్మిదేళ్ల చిన్నారి ఆ తర్వాత తిరిగి రాలేదు. ఆ తర్వాత ఆమె మృతదేహం శ్మశానవాటిక వద్ద కనిపించింది. కరెంట్ షాక్ కొట్టి ఆమె చనిపోయిందని భావించిన తల్లిదండ్రులు ఆమెకు దహన సంస్కారాలను నిర్వహస్తుండగా... విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు వచ్చి చితిమంటలపై నీటిని చల్లి, మృతదేహాన్ని బయటకు తీశారు. అంతేకాదు, బాలిక మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.