తెలంగాణలో కొత్తగా 591 కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 1,07,472 కరోనా పరీక్షలు
  • రాష్ట్రంలో 643 మందికి కరోనా నయం
  • ఇద్దరి మృతి ..ఇంకా 8,819 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,07,472 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 591 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 643 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. ఇప్పటిదాకా తెలంగాణలో 6,45,997 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,33,371 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,819 మందికి చికిత్స జరుగుతోంది. అటు కరోనా మృతుల సంఖ్య 3,807కి పెరిగింది.

Telangana
Corona Virus
New Cases
Deaths

More Telugu News