కచ్చితమైన జీఎస్టీ చెల్లింపులకు గాను కేంద్రం నుంచి టీటీడీకి ప్రశంసాపత్రం
- దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టి నాలుగేళ్లు
- కచ్చితంగా చెల్లింపులు చేసే సంస్థలకు సన్మానం
- క్రమం తప్పకుండా చెల్లిస్తున్న టీటీడీ
- 11 రాష్ట్రాల్లో టీటీడీకి జీఎస్టీ రిజిస్ట్రేషన్
దేశంలోని 11 రాష్ట్రాల్లో లావాదేవీల నిమిత్తం టీటీడీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంది. అందులో, రెండు రాష్ట్రాల్లో టీటీడీ జరిపిన లావాదేవీల జీఎస్టీ చెల్లింపులకు గాను కేంద్రం నుంచి ఈ ప్రశంసాపత్రం అందింది. దేశంలో 1.3 కోట్ల సంస్థలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోగా, అందులో 54,439 సంస్థలు జీఎస్టీని కచ్చితంగా చెల్లిస్తున్నాయి.