ఏపీలో కొత్తగా 2,058 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 78,992 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 364 కేసులు
  • కర్నూలు జిల్లాలో 11 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో 23 మంది మృతి
ఏపీలో గడచిన 24 గంటల్లో 78,992 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,058 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 364 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 325, చిత్తూరు జిల్లాలో 284, ప్రకాశం జిల్లాలో 242 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 11 కొత్త కేసులు గుర్తించారు.

అదే సమయంలో 2,053 మంది కరోనా నుంచి కోలుకోగా, 23 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 13,377 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,66,175 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,31,618 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 21,180 మందికి చికిత్స జరుగుతోంది.

Andhra Pradesh
Corona Virus
New Cases
Deaths

More Telugu News