కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన నయనతార
- 'చాయ్ వాలే'లో నయనతార పెట్టుబడులు
- ఆమెతో పాటు, ఆమె ప్రియడు విఘ్నేశ్ కూడా పెట్టుబడులు పెట్టిన వైనం
- ఏడాది లోపల 35 స్టోర్లను తెరవాలనేదే కంపెనీ లక్ష్యం
'చాయ్ వాలే' బిజినెస్ విషయంలోకి వెళ్తే... ఈ సంస్థ దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఫంక్షనల్ స్టోర్లను తీసుకొస్తోంది. ఏడాది లోపల పూర్తిగా పని చేసే 35 స్టోర్లను తెరవాలనేది కంపెనీ ప్రణాళిక అని సమాచారం. ఈ సంస్థలో పలువురు సినీ ప్రముఖులు పెట్టుబడి పెట్టారు. మరోవైపు నయన్, విఘ్నేశ్ కాంబినేషన్లో ప్రస్తుతం 'కాతు వాకుల రెండు కాదల్' అనే సినిమా తెరకెక్కుతోంది.