పీవోకేలో పాకిస్థాన్ నిర్వహించిన ఎన్నికలు ఓ బూటకం: భారత్
- ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఎన్నికలు
- ఇమ్రాన్ ఖాన్ పార్టీకి 25 స్థానాలు
- తీవ్రంగా స్పందించిన భారత్
- ప్రపంచాన్ని మభ్యపెట్టేందుకే ఎన్నికలని ఆరోపణ
అయితే, భారత ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించింది. పీవోకేలో పాక్ నిర్వహించిన ఎన్నికలు వట్టి బూటకం అని విమర్శించింది. దురాక్రమణలపై ప్రపంచాన్ని మభ్యపెట్టేందుకే ఎన్నికలు అని పేర్కొంది. పీవోకేలో ఎన్నికల అంశంపై పాకిస్థాన్ కు గట్టిగా నిరసన తెలిపామని కేంద్రం వెల్లడించింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఎన్నికలను స్థానికులు తిరస్కరించారని స్పష్టం చేసింది. పీవోకేలో ఎన్నికలు స్థానికుల హక్కుల ఉల్లంఘనే అని, స్థానికుల స్వేచ్ఛను హరిస్తున్నారని ఆరోపించింది. భారత భూభాగాలను ఖాళీ చేయాలని పాక్ కు స్పష్టం చేశామని కేంద్రం తెలిపింది.