రూపాయి జీతం తీసుకునే జగన్.. హెలికాప్టర్ ఖర్చు తగ్గించుకుంటే మంచిది: రఘురామకృష్ణరాజు
- రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది
- జగన్ జనబాహుళ్యంలోకి రావాలి
- సీజేఐ ఎన్వీ రమణ తెలుగు భాషలో విచారణ జరపడం సంతోషకరం
మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద మనసుతో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారని... అయితే ఇళ్ల నిర్మాణాలను ఇంకా పూర్తి చేయలేదని ప్రజలు బాధ పడుతున్నారని చెప్పారు. ఇళ్ల విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటేనే ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. ఇదిలావుంచితే, సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు భాషలో విచారణ జరపడం చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. సొంత భాషలోని కమ్మదనం పరాయి భాషలో ఉండదని అన్నారు.