Sri Vishnu: 'రాజ రాజు వచ్చే' సాంగ్ కి మంచి రెస్పాన్స్!

Huge responce for Raja raju vachhe lyrical song
షార్ట్స్‌లో చూడండి
శ్రీవిష్ణు మొదటి నుంచి కూడా వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఇంతవరకూ ఆయన చేసిన సినిమాల జాబితాను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆయన తాజా చిత్రంగా సిద్ధమైన 'రాజ రాజ చోర' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన టీజర్ .. ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా నిన్న సాయంత్రం ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను వదిలారు. ఈ లిరికల్ సాంగ్ కి కూడా మంచి స్పందన వస్తోంది. 'రాజ రాజు వచ్చే .. 'అంటూ ఈ పాట సాగుతోంది. హీరో స్వభావం .. ఆయన చేసే దొంగపనులపై ఈ పాట నడుస్తుంది. నగలు .. కిరీటం ధరించి మరీ హీరో తప్పించుకుంటూ ఉండటం చూడటానికి సరదాగా అనిపిస్తుంది.

వివేక్ సాగర్ సంగీతాన్ని అందించిన ఈ పాటను మోహన భోగరాజు ఆలపించారు. ట్యూన్ కొత్తగా .. ఆకట్టుకునేలా ఉంది. విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకి, హసిత్ గోలి దర్శకత్వం వహించాడు. మేఘ ఆకాశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, త్వరలోనే థియేటర్లలో విడుదల చేయనున్నారు.
Go Back to Shorts
Sri Vishnu
Megha Akash
Hasith Goli

More Telugu News