పక్కా ప్లానింగుతో 'ప్రాజెక్టు K' షూటింగ్!
- ప్రభాస్ హీరోగా 'ప్రాజెక్టు K'
- సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే కథ
- 90 శాతం షూటింగ్ ఫిల్మ్ సిటీలో
- త్వరలో రెగ్యులర్ షూటింగు
ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో ... ప్రతి అంశంలో నాగ్ అశ్విన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ వచ్చారు. తనకి ఉన్న సమయాన్ని ఎంతమాత్రం వదులుకోకుండా ఈ ప్రాజెక్టుపైనే పెట్టానని ముందునుంచే ఆయన చెబుతూ వస్తున్నారు. అదే ప్లానింగుతో ఆయన ముందుకు వెళుతున్నారు. సైన్స్ ఫిక్షన్ సినిమా కావడం వలన 90 శాతం షూటింగును ఫిల్మ్ సిటీలోనే చిత్రీకరించాలనే నిర్ణయానికి ఆయన వచ్చారని అంటున్నారు.
కేవలం ఓ 10 శాతం షూటింగు మాత్రమే బయట చేయవలసి ఉంటుందట. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, షూటింగు జరిగేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడని, అలాగే సాధ్యమైనంత వేగంగా ఈ సినిమా షూటింగు జరిగేలా చూస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.