పోలీసులపై దాడి చేసిన ఇసుక మాఫియా
- జగిత్యాల జిల్లాలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా
- పక్కా సమాచారంతో వాగులోకి వెళ్లిన పోలీసులు
- కర్రలు, రాళ్లతో దాడి చేసిన దుండగులు
ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. అనంతరం ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నవారు వాహనాలను అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు ఐదు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చేపట్టారు.