వైఎస్ వివేక హత్య కేసులో విచారణకు హాజరైన ముగ్గురు అనుమానితులు
- కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచారణ
- పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రకాశ్ హాజరు
- తిరుపతికి చెందిన డాక్టర్ సతీశ్ కుమార్ రెడ్డి కూడా
కొన్ని రోజులుగా కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలోనే సీబీఐ అధికారులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పర్యవేక్షణ అధికారిని మారుస్తూ సీబీఐ నిర్ణయం తీసుకుంది. ఈ కేసు డీఐజీ సుధాసింగ్ నుంచి ఎస్పీ రామ్‌కుమార్‌కు బదిలీ అయింది.