వలసదారులతో వెళుతున్న పడవ బోల్తా.. లిబియాలో 57 మంది దుర్మరణం
- దుర్ఘటన సమయంలో పడవలో 57 మంది
- మృతుల్లో 20 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు
- మెరుగైన జీవనం కోసం ఐరోపాకు వలస వెళ్తుండగా ఘటన
ఈ దుర్ఘటనలో 57 మంది చనిపోయినట్టు భావిస్తున్నట్టు యూఎస్ మైగ్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమ తీర పట్టణమైన ఖుమ్స్ నుంచి పడవ నిన్న బయలుదేరినట్టు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రతినిధి సఫా మెహ్లీ పేర్కొన్నారు. మృతుల్లో నైజీరియా, ఘనా, గాంబియా తదితర దేశాలకు చెందినవారు ఉన్నట్టు సమాచారం.