ఏపీలో కొత్తగా 1,627 కరోనా పాజిటివ్ కేసులు

AP Corona Positive Cases bulletin
  • గత 24 గంటల్లో 57,672 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 357 కేసులు
  • విజయనగరం జిల్లాలో 4 కేసులు
  • రాష్ట్రంలో 17 కరోనా మరణాలు
  • ఇంకా 21,748 మందికి చికిత్స
రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 57,672 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,627 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 357 కొత్త కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 284, ప్రకాశం జిల్లాలో 235, నెల్లూరు జిల్లాలో 216 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 4 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 2,017 మందికి కరోనా నయం కాగా, 17 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,273కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,56,392 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,21,371 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 21,748 మందికి చికిత్స జరుగుతోంది.
Go Back to Shorts
Andhra Pradeshc
Corona Virus
Positive Cases
Deaths

More Telugu News