టీఆర్ఎస్ అవినీతిపై పోరు కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయం
- మధుయాష్కీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం
- ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా దృష్టికి కోకాపేట భూముల వ్యవహారం
- పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీ, హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయం
పోడు భూముల రక్షణ కోసం కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ నిరసనలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వారిపై డీజీపీకి, హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు చేస్తామన్నారు. త్వరలోనే దళిత, గిరిజన, బీసీ దండోరా చేపడతామని, ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు దళిత దండోరా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు మధుయాష్కీ తెలిపారు. మరో నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రైతుల నుంచి విలువైన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని రైతులు వెళ్తే వారు కూడా ప్రైవేటు ఫాం హౌస్‌లలోనే ఉంటున్నారని ఆరోపించారు.