Banda Sriniveas madiga: తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా బండా శ్రీనివాస్ మాదిగను నియమించిన కేసీఆర్

Telangna govt appoints Banda Srinivas as SC Corporation Chairman
  • శ్రీనివాస్ స్వతహాగా హాకీ క్రీడాకారుడు   
  • టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం  
  • సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్ 
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ మాదిగను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. హుజూరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ తొలుత కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. స్వతహాగా హాకీ క్రీడాకారుడైన ఆయన.. హుజూరాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.

హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా, జిల్లా టెలికం బోర్డు సభ్యుడిగానూ పనిచేశారు. హుజూరాబాద్ నుంచి రెండుసార్లు ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఎస్సీ కులాల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్‌గా కేసీఆర్ తనను నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Banda Sriniveas madiga
Telangana
SC Corporation
TRS

More Telugu News