Andhra Pradesh: హిజ్రాగా మారితే పెళ్లాడతానన్న మహిళ.. తీరా మారాక నిరాకరించడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

woman refuge to marry young girl after changed as Hijra
  • ఏపీలోని కడపలో ఘటన
  • కొన్నాళ్లు కలిసుండి, ముఖం చాటేసిన మహిళ
  • కేసును ఎలా పరిష్కరించాలో తెలియక తలపట్టుకుంటున్న పోలీసులు 
హిజ్రాగా మారితే పెళ్లాడతానన్న మహిళ మాటలు నమ్మిన ఓ యువతి మోసపోయింది. హిజ్రాగా మారాక సదరు మహిళ పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. కారుణ్య నియామకాల్లో భాగంగా ఓ యువతికి ప్రభుత్వ ఉద్యోగం లభించింది. శిక్షణ సమయంలో ఓ మహిళ యువతికి పరిచయమైంది. అది ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. ఈ క్రమంలో హిజ్రాగా మారితే పెళ్లాడతానంటూ మహిళ చెప్పింది.

ఆమె మాటలు నమ్మిన యువతి హిజ్రాగా మారింది. కొంతకాలంగా కలిసి జీవిస్తున్నారు. తాజాగా యువతిని పెళ్లాడేందుకు ఆ మహిళ నిరాకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హిజ్రాగా మారమని చెప్పి, మారిన తర్వాత తనను మోసం చేసిందంటూ బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకున్నారు.
Andhra Pradesh
Kadap
Crime News

More Telugu News