అలాంటివాళ్లను అవసరమైతే చట్టాలను పక్కనబెట్టి మరీ వేటాడాలి: ఏపీ స్పీకర్ తమ్మినేని
- శ్రీకాకుళంలో దిశ కార్యక్రమం
- దిశ యాప్ ద్వారా సమాజంలో మార్పు రావాలన్న తమ్మినేని
- నాటి దిశ ఎన్ కౌంటర్ ప్రస్తావన
- మృగాళ్లను క్షమించరాదని వెల్లడి
- సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను అభినందించిన స్పీకర్
మృగాలుగా మారిన మగవాళ్లను క్షమించరాదని అన్నారు. అవసరమైతే చట్టాలను పక్కనబెట్టి అలాంటివారిని వేటాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమాజానికి రక్షణ ఇవ్వాల్సిన మగాడే మృగంలా మారితే ఎలా? అని వ్యాఖ్యానించారు. అత్యాచారాలకు పాల్పడే వారు భూమిపై ఉండేందుకు పనికిరారని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాముడు, కృష్ణుడు తిరిగిన పుణ్యభూమిలో ఇలాంటి దుర్మార్గాలు ఏంటని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. నైతికత ఏమాత్రం లేని రీతిలో కన్నతండ్రులే పసిమొగ్గలను చిదిమేస్తున్న ఘటనలు దారుణమని భావోద్వేగాలకు లోనయ్యారు.