Team India: శ్రీలంకతో చివరి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో గెలిచిన టీమిండియా ఇవాళ నామమాత్రపు చివరి వన్డే ఆడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 3 ఫోర్లతో 13 పరుగులు చేసి చమీర బౌలింగ్ లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా 10 పరుగులతో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ కు అవకాశం ఇచ్చారు. ధావన్ అవుట్ కావడంతో వన్ డౌన్ లో శాంసన్ బరిలో దిగాడు.

ఈ సిరీస్ లోని తొలి రెండు మ్యాచ్ లు టీమిండియా గెలవడంతో శ్రీలంక సొంతగడ్డపై ఘోరపరాభవం ఎదుర్కొంది. కనీసం ఈ మ్యాచైనా గెలిచి పరువు దక్కించుకోవాలనుకుంటోంది.

ఈ మ్యాచ్ లో భారత్ ఐదుగురు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. శాంసన్, నితీశ్ రాణా, సకారియా, గౌతమ్ కృష్ణప్ప, రాహుల్ చహర్ తమ కెరీర్లో తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్నారు.
Team India
Toss
Sri Lanka
Third ODI
Colombo

More Telugu News