YS Vivekananda Reddy: వివేకా కేసు దర్యాప్తులో ప‌ర్య‌వేక్ష‌ణ అధికారి మార్పు

trail in viveka case
షార్ట్స్‌లో చూడండి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచార‌ణ కొనసాగిస్తోన్న విష‌యం తెలిసిందే. కొన్ని రోజులుగా అక్క‌డే సీబీఐ అధికారులు అనుమానితుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. ఈ కేసులో మ‌రిన్ని వివ‌రాల‌ను రాబ‌ట్టేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే, తాజాగా ఈ కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. పర్యవేక్షణ అధికారిని మార్చి వేస్తూ సీబీఐ నిర్ణ‌యం తీసుకుంది. ఈ కేసు డీఐజీ సుధాసింగ్‌ నుంచి ఎస్పీ రామ్‌కుమార్‌కు బదిలీ అయింది. ఈ కేసులో 44 రోజులుగా ద‌ర్యాప్తు కొనసాగింది. ఇప్పుడు పర్యవేక్షణ అధికారిని మార్చ‌డం చర్చనీయాంశం అవుతోంది.
Go Back to Shorts
YS Vivekananda Reddy
Andhra Pradesh
YSRCP

More Telugu News