దైనిక్ భాస్కర్ తో పాటు మరో న్యూస్ ఛానల్ పై ఐటీ దాడులు
- దైనిక్ భాస్కర్ కు చెందిన 35 చోట్ల సోదాలు
- ప్రమోటర్ల నివాసాలు, కార్యాలయాలపై కూడా దాడులు
- మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై కథనాలు ప్రచురించినందుకే దాడులు చేశారన్న జైరామ్ రమేశ్
ఉత్తరప్రదేశ్ కు చెందిన భారత్ సమాచార్ ఛానల్ పై కూడా ఐటీ దాడులు జరిగాయి. ట్యాక్స్ డాక్యుమెంట్ల కోసం ఈ ఛానల్ ఎడిటర్ నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. మరోవైపు ఈ దాడులపై విపక్షాలు మండిపడుతున్నాయి. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమయిందనే కథనాలను ప్రసారం చేసినందుకే ఈ సంస్థలపై ఐటీ దాడులు చేయించారని ఆరోపించాయి. ప్రధాని మోదీ వైఫల్యాలను లేవనెత్తినందుకు ఆ సంస్ధలు మూల్యం చెల్లించుకుంటున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ అన్నారు.