పెగాసస్ వివాదం.. మిస్టర్ మోదీ అంటూ నిప్పులు చెరిగిన ‘దీదీ’
- ఆన్‌లైన్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడిన మమత
- ఇది మీపై వ్యక్తిగత దాడి కాదంటూనే నిప్పులు
- రాష్ట్రానికి నిధులివ్వకుండా స్పైవేర్ కోసం మాత్రం కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపణ
కోట్లాది రూపాయలను మోదీ గూఢచర్యం కోసం వెచ్చిస్తున్నారని మోదీ ఆరోపించారు. మీడియా, న్యాయ, ఎన్నికల కమిషన్‌ను పెగాసస్ ఆక్రమించుకుందన్నారు. రాష్ట్రానికి నిధులివ్వడానికి చేతులు రావు కానీ, స్పైవేర్ల కోసం మాత్రం కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగాసస్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు. బీజేపీని దేశం నుంచి తరిమికొట్టే వరకు ‘ఖేలాహోబె దివస్’ జరపాలన్నారు.