'ఆర్ఆర్ఆర్' సెట్స్ లో అందాల అలియా భట్!
- ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్'
- చివరి షెడ్యూల్ షూటింగ్
- తెలుగులో అలియాకు తొలి సినిమా
- దసరాకి భారీ స్థాయి రిలీజ్
అలియా భట్ కి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది .. దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ తరం కథానాయికలలో గ్లామర్ తో పాటు, అభినయం కూడా తెలిసిన నాయికగా ఆమెని గురించి చెబుతుంటారు. ఈ సినిమాలో ఆమె పాత్ర భావోద్వేగాలతో కూడినదిగా ఉంటుంది. అందువల్లనే ఆమెను ఎంపిక చేశారు. ఈ నెలలో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంటుందని చెబుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అధికారికంగానే అందుకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగణ్ తో పాటు పలువురు హాలీవుడ్ ఆర్టిస్టులు నటిస్తున్న సంగతి తెలిసిందే.