బంతిలా ఎగిరిన కోడిగుడ్లు.. నెల్లూరు జిల్లాలో నకిలీ కలకలం
- 30 గుడ్లు రూ. 130కే విక్రయం
- ఎగబడి కొనుగోలు చేసిన జనం
- ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయిస్తామన్న పశువైద్యాధికారి
వాటిని ఉడికించేందుకు ప్రయత్నించగా ఎంతకీ ఉడకకపోవడంతో అనుమానం వచ్చిన ఓ మహిళ వాటిని నేలకేసి కొట్టగా బంతిలా ఎగిరిపడ్డాయి. దీంతో అవి ప్లాస్టిక్ కోడిగుడ్లుగా భావించి వాటిని కట్ చేయగా లోపల పచ్చగా ఉన్న సొన తెల్లగా ప్లాస్టిక్‌లా ఉండడంతో తాము మోసపోయినట్టు గుర్తించారు. నకిలీ కోడిగుడ్ల వ్యవహారం కలకలం రేపడంతో స్పందించిన పశువైద్యాధికారి వాటిని పరిశీలించారు. వీటిని ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.