విశాల్ హీరోగా బోయపాటి మూవీ?
- 'అఖండ' పనుల్లో బోయపాటి
- నెక్స్ట్ మూవీ బన్నీతో చేసే ఛాన్స్
- తదుపరి సినిమా విశాల్ తో
- త్వరలో పూర్తి వివరాలు
ప్రస్తుతం బోయపాటి 'అఖండ' సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దసరాకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తరువాత సినిమా దాదాపు బన్నీతో ఉండొచ్చునని వార్తలొస్తున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సరైనోడు'భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. బన్నీ సినిమా తరువాతనే విశాల్ ప్రాజెక్టును బోయపాటి పట్టాలెక్కించవచ్చని అంటున్నారు.