కొవిడ్ బాధితుల్లో దీర్ఘకాలిక సమస్యలు.. 203 లక్షణాలు!
- బ్రిటన్ యూనివర్సిటీ చేసిన వెబ్ ఆధారిత సర్వే
- మొత్తం 3,762 మంది నుంచి సమాధానాలు
- ఏడు నెలలపాటు వేధించనున్న 66 లక్షణాలు
మొత్తం 56 దేశాలకు చెందిన 3,762 మంది నుంచి సమాధానాలు రాబట్టారు. ఇందులో భాగంగా మొత్తం 203 లక్షణాలను గుర్తించారు. వీటిలో 66 లక్షణాలు ఏడు నెలలపాటు కొనసాగినట్టు శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది. వీరు గుర్తించిన లక్షణాల్లో అలసట, మానసిక సమస్యలు, కొద్దిపాటి శ్రమకే విపరీతంగా అలసిపోవడం, చిత్తభ్రమలు, గుండెలో దడ, చర్మంపై దురద, మూత్రాశయ నియంత్రణ సమస్యలు, జ్ఞాపకశక్తి మందగించడం, చూపు మసకబారడం, డయేరియా వంటి సమస్యలతోపాటు మహిళల రుతుక్రమంలో మార్పులు, లైంగిక సమస్యలు వంటివి ఉన్నాయి.