తెలంగాణలో కొత్తగా 749 కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 1,15,237 కరోనా పరీక్షలు
  • ఖమ్మం జిల్లాలో 96 కొత్త కేసులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 72 కేసులు
  • రాష్ట్రంలో ఐదుగురి మృతి
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,15,237 కరోనా పరీక్షలు నిర్వహించగా, 749 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 96 కొత్త కేసులు వెల్లడి కాగా, గ్రేటర్ హైదరాబాద్ లో 72 కేసులు గుర్తించారు. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 605 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం 3,743 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,33,895 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,19,949 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,203 మంది చికిత్స పొందుతున్నారు.

Telangana
Corona Virus
New Cases
Deaths

More Telugu News