'పుష్ప' ఫస్టు సింగిల్ కి వేళయినట్టే!
- హైదరాబాద్ లో 'పుష్ప' షూటింగ్
- మారేడుమిల్లిలో చివరి షెడ్యూల్
- 'క్రిస్మస్'కి రిలీజ్ చేసే ఛాన్స్
- దేవిశ్రీ సంగీతం ప్రత్యేక ఆకర్షణ
సుకుమార్ .. దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా మ్యూజిక్ పరంగా మంచి మార్కులు కొట్టేశాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను 'క్రిస్మస్'కి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
అల్లు అర్జున్ సరసన నాయికగా రష్మిక నటిస్తుండగా, ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. మారేడుమిల్లి షెడ్యూల్లో పూర్తిస్థాయిలో ఫాహద్ పాల్గొంటాడని అంటున్నారు. సుకుమార్ ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. ఆ తరువాతనే 'పుష్ప 2' షూటింగ్ మొదలవుతుంది.